‘మీ టూ’ ఉద్యమంపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
- బాధితులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ చీఫ్
- ప్రతిఒక్కరూ మహిళల్ని గౌరవించాలి
- నిజాన్ని నిర్భయంగా, గట్టిగా చెప్పాలి
‘మహిళలతో మర్యాదగా, గౌరవంగా ఎలా ప్రవర్తించాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా చేయని వారికి అన్ని రంగాల్లో దారులు మూసుకుపోతుండటం సంతోషకరమైన విషయం. ఇప్పటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే నిజాన్ని గట్టిగా, నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ ఈ రోజు ట్వీట్ చేశారు.