గాయని చిన్మయికి మీడియాతో ఇబ్బందులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాయని చిన్మయికి మీడియాతో ఇబ్బందులు!

  • తన తల్లిని ఇబ్బంది పెట్టవద్దంటూ మీడియాకు వినతి
  • మీడియాకు ఇంటర్యూ ఇచ్చేందుకు చిన్మయి విముఖత
  • సమాచారం కోసం చిన్మయి తల్లికి ఫోన్లు చేస్తున్న మీడియా వర్గాలు
‘మీ టూ’ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చర్చనీయాంశంగా మారారు. అనేక మంది బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను చిన్మయి సహాయంతో బయటపెడుతున్నారు. కానీ ఈ పరిస్థితులే చిన్మయి, ఆమె కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటర్యూ కోసం మీడియా వర్గాలు చిన్మయిని విసుగిస్తున్నాయట. ముఖ్యంగా తమిళనాడు మీడియా వర్గాలు ఆమె ఇంటర్వూ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అయితే, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చిన్మయి విముఖత వ్యక్తం చేస్తోంది. ఎలాంటి ఫోన్‌ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో చిన్మయి తల్లికి మీడియా వర్గాలు ఫోన్లు చేస్తున్నాయట. ఈ పరిస్థితి చిన్మయి తల్లికి ఇబ్బందికరంగా మారింది. దీంతో 69 ఏళ్ల వయసున్న ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితిపై విసుగు చెందిన చిన్మయి ట్విట్టర్ ద్వారా మీడియాకు ఓ విన్నపం చేశారు. పదేపదే తన తల్లికి ఫోన్లు చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. 'దయచేసి ఆమెకు కాల్స్ చేయకండి' అంటూ మీడియాను ఆమె కోరారు. 
Chinmayi

More Telugu News