రికార్డు స్థాయిలో పలికిన 'అరవింద' శాటిలైట్ హక్కులు!
Add ap7am to your home Screen

రికార్డు స్థాయిలో పలికిన 'అరవింద' శాటిలైట్ హక్కులు!

  • బలమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే పాటలు 
  • మనసును తాకే మాటలు 
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగిన కథాకథనాలు .. హుషారుగా సాగిన పాటలు .. త్రివిక్రమ్ మాటలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం టీవీ ఛానల్స్ పోటీ పడ్డాయట.

మొత్తానికి జీ తెలుగు ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నారు. ఇందుకోసం వాళ్లు 23.50 కోట్లు చెల్లించినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ సినిమాకి ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు పలకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటమే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనేది ఎన్టీఆర్ అభిమానుల మాట. 
ntr
pooja

More Telugu News