వెస్టిండీస్ తో రెండో టెస్ట్ రేపే... టీమిండియా జట్టు ఇదే!

ఇండియా-వెస్టిండీస్ ల మధ్య రెండో టెస్టు రేపట్నుంచి హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, రెండో టెస్టుకు సంబంధించి 12 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను బీసీసీఐ ప్రకటించింది. జాబితాలో ఒక మార్పును చేసింది. మొహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు అవకాశాన్ని కల్పించింది. అయితే, తొలి మ్యాచ్ లో ఉన్న 11 మంది ఆటగాళ్లే రెండో టెస్టులో ఉండే అవకాశం ఉంది. హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లకు తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు. రెండో టెస్టు తుది జాబితా నుంచి కూడా వారిని పక్కన పెట్టేశారు.

12 మందితో కూడిన టీమిండియా ఆటగాళ్ల జాబితా ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.

రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.  

india
west indies
second test
team list

More Telugu News