జగపతిబాబు పాత్రను అందరూ ద్వేషిస్తారు: త్రివిక్రమ్
Add ap7am to your home Screen

జగపతిబాబు పాత్రను అందరూ ద్వేషిస్తారు: త్రివిక్రమ్

  • ఇది పవన్ కోసం అనుకున్న కథ కాదు 
  • ఎన్టీఆర్ ఫ్యాన్స్  ఆశించేలానే ఉంటుంది 
  • 'పెనివిటి' పాట ప్రత్యేకమైనది   
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం .. ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి త్రివిక్రమ్ మాట్లాడారు. "ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాను. కొత్త కోణంలో ఈ సినిమాను ఆవిష్కరించాననే అనుకుంటున్నాను.

ఈ సినిమాలో ఎమోషనల్ గా సాగే 'పెనివిటి' సాంగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అహంభావం వున్న వాళ్లు తమ పంతం నెగ్గించుకోవడానికి ఎంతదూరమైనా వెళతారు అనేది జగపతిబాబు పాత్ర నిరూపిస్తుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఆయన పాత్రను ద్వేషిస్తారు. ఇక పవన్ తో చేయాలనుకున్న కథను .. ఎన్టీఆర్ తో చేశాననే ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు. ఇది ఎన్టీఆర్ కోసమే రాసిన కథ .. అందుకే ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.    
ntr
pooja
jagapathi

More Telugu News