ఒకే ఒక్క నిమిషంలో పెద్ద ప్రమాదం తప్పింది: రాజబాబు సోదరుడు అనంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే ఒక్క నిమిషంలో పెద్ద ప్రమాదం తప్పింది: రాజబాబు సోదరుడు అనంత్

  • 'పాండురంగడు' సెట్లో వున్నాను
  • లైటింగ్ జరుగుతోంది 
  • ఒక్కసారిగా షాండిలియర్ పడిపోయింది
తాజాగా 'ఆలీతో సరాదాగా' కార్యక్రమంలో అనంత్ మాట్లాడుతూ, 'పాండురంగడు' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. "రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'పాండురంగడు' సినిమా చేస్తున్నాను. ఆ రోజున సెట్లో లైటింగ్ జరుగుతోంది. రాఘవేంద్రరావుగారు .. నేను .. కో డైరెక్టర్ కలిసి సెట్లో ఒకచోట నుంచుని మాట్లాడుకుంటున్నాము.

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్లాము. అంతే, పైనుంచి పెద్ద షాండిలియర్ పడిపోయింది. సినిమా కోసం కట్టిన షాండిలియర్ అది .. దానికి పెద్ద పెద్ద గంటలు కూడా కట్టేసి వున్నాయి. అలా మేము పక్కకి జరిగామో లేదో ఒకే ఒక్క నిమిషంలో అది పెద్ద శబ్దంతో పడిపోవడంతో, ఏం జరిగిందనేది కొద్దిసేపటివరకూ మాకు అర్థం కాలేదు. అంత పెద్ద ప్రమాదం నుంచి ఆ పాండురంగడే మమ్మల్ని కాపాడాడు" అని చెప్పుకొచ్చాడు.
rajababu
chittibabu
ananth

More Telugu News