రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'పై ఆసక్తికర అప్ డేట్!
Add ap7am to your home Screen

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'పై ఆసక్తికర అప్ డేట్!

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలసి భారీ మల్టీ స్టారర్
  • స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అంటూ ప్రచారం
  • తయారవుతున్న సెట్స్, ప్రాపర్టీస్
రాజమౌళి 'బాహుబలి' రెండు భాగాల తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలసి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

ఇది స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన సెట్స్, ఆ కాలంలో వాడాల్సిన ప్రాపర్టీస్ తదితరాలను ప్రస్తుతం రాజమౌళి టీమ్ దగ్గరుండి తయారు చేయిస్తోందట. డిసెంబర్ నుంచి జరిగే షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడని, రామ్ చరణ్ కొన్ని రోజుల తరువాత జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
Rajamouli
RRR
Ramcharan
NTR

More Telugu News