మహేశ్ ని కాజల్ తిరస్కరించడం ఆడియన్స్ కి ఎక్కలేదు: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ ని కాజల్ తిరస్కరించడం ఆడియన్స్ కి ఎక్కలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'బ్రహ్మోత్సవం'లో కాజల్ ని మహేశ్ ప్రేమిస్తాడు 
  • ఆమె అతనికి నో చెబుతుంది
  • అది ఆడియన్స్ కి నచ్చలేదు
'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో ఈ వారం 'బ్రహ్మోత్సవం' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేశ్ బాబును చూడగానే అమ్మాయిలు మనసు పారేసుకుంటూ వుంటారు. మహేశ్ బాబు అందగాడు కావడం వలన .. ఆయనకి గల క్రేజ్ కారణంగా ఆ సీన్స్ ను జనం ఇష్టపడ్డారు. కానీ 'బ్రహ్మోత్సవం'లో తనకి దూరం .. దూరంగా వుండే కాజల్ వెంట మహేశ్  పడటం ఆడిటోరియానికి ఎక్కలేదేమోననేది నా అనుమానం.

హీరోయిన్ ప్రేమించి హీరో వద్దంటే అక్కడ హీరోయిన్ కన్నీళ్లు కరుణ రసానికి కారణమవుతాయి. కానీ హీరో ఇష్టపడినప్పుడు హీరోయిన్ వద్దంటే హీరో పాత్ర పాతాళానికి పడిపోతుంది. ఈ సినిమాలో కాజల్ .. మహేశ్ ప్రేమను తిరస్కరిస్తుంది. చాలా సున్నితంగానే ఆమె ఆ విషయం చెప్పినప్పటికీ ఆడియన్స్ తట్టుకోలేకపోయారు. ఆ మాట చెప్పడం వలన హీరోయిన్ పాత్ర కూడా వాళ్లకి ఎక్కలేదు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి ఇది ప్రధానమైన కారణం కావొచ్చనేది నా అభిప్రాయం.    
Mahesh Babu
kajal

More Telugu News