బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన విండీస్ బ్యాటింగ్ లైనప్

రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పూర్తిగా చేతులెత్తేసింది. బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లో కూడా విండీస్ ఆటగాళ్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 649 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో మరో 555 పరుగులు వెనకబడి ఉంది.

విండీస్ ఇన్నింగ్స్ ను ఆదిలోనే మొహమ్మద్ షమీ దెబ్బతీశాడు. 2 పరుగుల వద్ద ఓపెనర్ బ్రాత్ వైట్ ను, 7 పరుగుల వద్ద మరో ఓపెనర్ పావెల్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా విండీస్ ఇన్నింగ్స్ ఎక్కడా కుదుటపడలేదు. వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రాత్ వైట్ 2, పావెల్ 1, హోప్ 10, హెట్మర్ 10, అంబ్రిస్ 12, డౌరిచ్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఛేస్ 27, పాల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు. ఒకరు రనౌట్ అయ్యారు. 
Go Back to Shorts
team india
west indies
rajkot
test

More Telugu News