స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం... బంజారాహిల్స్ లో గుట్టు రట్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం... బంజారాహిల్స్ లో గుట్టు రట్టు!

  • 'స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌'లో అసాంఘిక కార్యకలాపాలు
  • గత కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు
  • దాడి చేస్తే పట్టుబడిన ముగ్గురు యువతులు
స్పా సెంటర్‌ ముసుగులో యథేచ్ఛగా జరుగుతున్న వ్యభిచార దందాకు హైదరాబాద్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగర పరిధిలోని ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్ లో 'స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌'లో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, బయటి నుంచి అమ్మాయిలను తెచ్చి, వారితో క్రాస్ మసాజ్, వ్యభిచారం చేయిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.

వీటిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు, కొంత కాలం నిఘా ఉంచి, ఒక్కసారిగా దాడికి దిగారు. స్పా సెంటర్ లో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు యువతులు పట్టుబడగా, వారిని అదుపులోకి తీసుకుని స్పాను సీజ్ చేశారు. పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, పరారీలో ఉన్న స్పా సెంటర్ యజమాని సతీష్ కోసం గాలిస్తున్నామని అన్నారు.
Spa
Hyderabad
Banjarahills
Police
Massage

More Telugu News