కేటీఆర్ కు వినతిపత్రాన్ని అందించిన బాల్క సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ కు వినతిపత్రాన్ని అందించిన బాల్క సుమన్

  • నేతకాని కులానికి స్థలం, నిధులు మంజూరు చేయండన్న సుమన్
  • సానుకూలంగా స్పందించిన కేటీఆర్
  • ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే పరిశీలిస్తామంటూ హామీ
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వినతి పత్రాన్ని అందించారు. హైదరాబాదులో అన్ని కులాలకు స్థలాల కేటాయింపు, భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేసినట్టుగానే 'నేతకాని' కులానికి కూడా స్థలాన్ని, నిధులను కేటాయించాలని విన్నవించారు. బాల్క సుమన్ విజ్ఞప్తిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
KTR
balka suman
TRS
netakani

More Telugu News