పాలకొల్లులో చిరంజీవికి పట్టిన గతే పవన్ కూ పడుతుంది!: ఎంపీ కేసినేని తీవ్ర విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాలకొల్లులో చిరంజీవికి పట్టిన గతే పవన్ కూ పడుతుంది!: ఎంపీ కేసినేని తీవ్ర విమర్శలు

  • ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమే
  • యాక్టర్ కావడంతోనే చూసేందుకు వస్తున్న జనం
  • వాపును చూసి బలుపనుకుంటున్నారని విమర్శలు
జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, చిరంజీవికి పాలకొల్లులో ఎదురైన పరాభవమే ఎదురవుతుందని తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టే ఆయన్ను చూడటానికి జనం వస్తున్నారని, వారిలో ఓట్లు వేసేవారుండరని వ్యాఖ్యానించారు. పవన్ వాపును చూసి బలుపని అనుకుంటున్నారని, ఆయన ఘోరమైన ఓటమికి అతి దగ్గరలో ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి అందిన ఆదేశాల మేరకు చంద్రబాబును విమర్శిస్తున్న ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
Pawan Kalyan
Palakollu
Chiranjeevi
Kesineni Nani

More Telugu News