'అరవింద సమేత'లో జగపతిబాబు పాత్రపైనే అందరి దృష్టి
Add ap7am to your home Screen

'అరవింద సమేత'లో జగపతిబాబు పాత్రపైనే అందరి దృష్టి

  • విడుదలకి సిద్ధంగా 'అరవింద సమేత ' 
  • ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు 
  • ఆయన నటనకి ఎన్టీఆర్ కితాబు
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ఈ సినిమా విడుదలైన తరువాత అందరూ జగపతిబాబు పాత్రను గురించి మాట్లాడుకుంటారు అని అన్నాడు. కథానాయకుడు ఎంతటి బలవంతుడు అనే విషయం తెలియాలంటే .. అంతటి బలవంతుడైన ప్రతి నాయకుడు అవసరమని చెప్పాడు.

 అలాంటి ప్రతి నాయకుడి పాత్రలో జగపతిబాబు అద్భుతంగా నటించాడని అన్నాడు. ఈ పాత్రను పండించడానికి ఆయన ఎంతగా కష్టపడ్డారనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుందని చెప్పాడు. దానికి తోడు నిన్న రాత్రి విడుదల చేసిన ట్రైలర్లో జగపతిబాబు ముఖానికి కత్తి గాటుతో .. నోట్లో చుట్ట మాదిరిగా బుల్లెట్ పెట్టుకుని కనిపించాడు. దాంతో జగపతిబాబు పాత్రపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. 'రంగస్థలం' తరువాత ఆయన చేసిన మరో విలక్షణమైన పాత్ర ఇదనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 
ntr
pooja hegde

More Telugu News