'అరవింద సమేత' కన్నుల పండుగే అవుతుంది: దర్శకుడు బాబీ
Add ap7am to your home Screen

'అరవింద సమేత' కన్నుల పండుగే అవుతుంది: దర్శకుడు బాబీ

  • ఎన్టీఆర్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి 
  • అభిమానుల నిరీక్షణకు ఫలితం దక్కుతుంది 
  • నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా  
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి 'నోవాటెల్' హోటల్లో జరిగింది. ఈ వేదికపై ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆ విషయాన్ని గురించి తాజాగా దర్శకుడు బాబీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఎన్టీఆర్ మాటలు పదేపదే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయని అన్నాడు. ప్రతిమాట ఎన్టీఆర్ హృదయంలో నుంచి రావడం వల్లనే అవి ప్రతి ఒక్కరి మనసులను తాకగలిగాయని చెప్పాడు. ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా కోసం ఎంతోమంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారనీ, ఇంతకాలం వెయిట్ చేసినందుకు తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం తనకి ఉందని అన్నాడు. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్ .. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్ ఎన్టీఆర్ అభిమానులకు కన్నుల పండుగ చేస్తుందని చెప్పాడు. ఈ సినిమా విడుదలయ్యే సమయం కోసం అందరి మాదిరిగానే తాను కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.  
ntr
pooja hegde

More Telugu News