మహేశ్ బాబు వల్లే బిగ్‌బాస్‌లోకి: కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు వల్లే బిగ్‌బాస్‌లోకి: కౌశల్

  • ‘రాజకుమారుడు’ నుంచి మహేశ్‌తో పరిచయం
  • మోడలింగ్ అకాడమీ ఏర్పాటులో ప్రోత్సాహం
  • లేదంటే వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినే
తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్.. మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.  
Mahesh Babu
Tollywood
Kaushal
Big Boss
Vizag
Hyderabad

More Telugu News