తెలంగాణ ఎన్నికల కోసం... నేడు స్వయంగా రంగంలోకి బాలకృష్ణ!
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన
- ఏర్పాట్లు పూర్తి చేసిన స్థానిక నేతలు
- సాయంత్రం సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ
దాదాపు 45 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న సండ్ర వెంకట వీరయ్యను గెలిపించాలని బాలకృష్ణ ప్రజలను కోరనున్నారు. ఆపై సాయంత్రం సత్తుపల్లిలో జరిగే భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించనున్నారు.