సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పోస్ట్ ప్రొడక్షన్ లో తమన్నా సినిమా 
  • 'పందెం కోడి 3' వుందంటున్న విశాల్ 
  • రష్మిక షార్ట్ ఫిలింకు మంచి ఆదరణ 
*  హిందీలో హిట్టయిన 'క్వీన్' చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఆయా వెర్షన్ల షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. తెలుగులో తమన్నా నాయికగా 'దటీజ్ మహాలక్ష్మి' పేరిట వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విజయదశమికి రిలీజ్ చేస్తారు.
*  తాజాగా 'పందెం కోడి 2' చిత్రాన్ని నిర్మించిన హీరో విశాల్ ఈ చిత్రానికి మూడో పార్ట్ కూడా ఉంటుందని వెల్లడించాడు. 'పందెం కోడి 3'కి లింగుసామి దర్శకత్వం వహిస్తాడని, అందులో కూడా కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుందని చెప్పాడు. కాగా విశాల్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'పందెంకోడి 2' తెలుగు, తమిళ భాషల్లో దసరాకు రిలీజ్ కానుంది.
* గీతగోవిందం, దేవదాస్ చిత్రాల కథానాయిక రష్మిక మందన తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. 'ఎవ్రీ నాన్ తెలుగు ఫ్రెండ్ ఎవర్' పేరిట రూపొందిన ఈ లఘు చిత్రం ప్రస్తుతం యూ ట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతోంది.     
Thamanna
Vishal
Keerthi
Rajani

More Telugu News