కిరాయి సొమ్ము కోసం భార్యాపిల్లలను మార్చిన ఘనుడు జగ్గారెడ్డి: హరీష్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిరాయి సొమ్ము కోసం భార్యాపిల్లలను మార్చిన ఘనుడు జగ్గారెడ్డి: హరీష్ రావు

  • జగ్గారెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా దక్కదు
  • టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతుల కడుపు మండుతుంది
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిరాయి సొమ్ము కోసం భార్యాపిల్లలను మార్చిన ఘనుడు జగ్గారెడ్డి అంటూ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జగ్గారెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని... ఎప్పుడు చూసినా కరెంట్, విత్తనాలు, ఎరువుల కొరత ఉండేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించిందని... రైతుల ఆత్మహత్యలు లేకుండా చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతుల కడుపు నిండాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కడుపు మండుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, హరీష్ పైవ్యాఖ్యలు చేశారు. 
Harish Rao
jagga reddy
TRS
Congress

More Telugu News