త్రివిక్రమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్?

  • వెంకీ చేతిలో రెండు ప్రాజెక్టులు 
  • త్రివిక్రమ్ కోసమే బన్నీ వెయిటింగ్ 
  • పట్టాలెక్కేది ఈ కాంబినేషనే     
ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రెండు సినిమాలకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వీటిలో ఒకటి, వెంకటేశ్ తో కాగా, మరొకటి అల్లు అర్జున్ తో వుంటుంది.

వెంకటేశ్ తో చేసేది మల్టీ స్టారర్ కథ అని సమాచారం. ఇందులో మరో హీరో ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇక విక్రమ్ కుమార్ చెప్పిన కథ సెకండాఫ్ నచ్చకపోవడంతో, బన్నీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోపక్క వెంకీ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు వున్నాయి. ఇవి పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ ముందుగా బన్నీ సినిమానే మొదలెట్టేలా ఉన్నాడని తెలుస్తోంది.
venkatesh
allu arjun

More Telugu News