బావ కోసం మహేశ్ బాబు రంగంలోకి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బావ కోసం మహేశ్ బాబు రంగంలోకి!

  • థియేటర్లలో 'నన్ను దోచుకుందువటే'
  • తొలి రోజునే పాజిటివ్ టాక్ 
  • త్వరలో సక్సెస్ మీట్
సుధీర్ బాబు .. నభా నటేశ్ జంటగా ఈ నెల 21వ తేదీన 'నన్ను దోచుకుందువటే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తొలి రోజునే పాజిటివ్ టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ లేకపోయినా .. వసూళ్ల పరంగా నిలకడతో ముందుకు వెళుతోంది. దాంతో ఈ సినిమాకి నిర్మాత కూడా అయిన సుధీర్ బాబు .. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 ఈ సక్సెస్ మీట్ కి మహేశ్ ను రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడట. మహేశ్ బాబు వచ్చి ఈ సినిమా గురించి ఓ నాలుగు మాటలు చెబితే, థియేటర్స్ కి వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట. హీరోగాను .. నిర్మాతగాను సుధీర్ బాబుకి సక్సెస్ దక్కాలనే ఉద్దేశంతో మహేశ్ బాబు రంగంలోకి దిగుతున్నాడనే చెబుతున్నారు. త్వరలోనే సక్సెస్ మీట్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు.
sudheer babu
Mahesh Babu

More Telugu News