ఆ క్రెడిట్ మొత్తం నాగార్జున గారిదే: నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ క్రెడిట్ మొత్తం నాగార్జున గారిదే: నాని

  • నాగ్ సార్ తో మూవీ అనేసరికి భయపడ్డాను 
  • ఆయన నా భయాన్ని పోగొట్టారు 
  • నన్నెంతగానో ప్రోత్సహించారు   
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలసి 'దేవదాస్' సినిమా చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాని స్పందించాడు. "శ్రీరామ్ ఆదిత్య వచ్చి ఈ కథను వినిపించగానే నాకు బాగా నచ్చేసింది. మొదటి నుంచి కూడా నేను నా ఇమేజ్ గురించి .. స్టార్ డమ్ గురించి పెద్దగా ఆలోచించను.

అందునా నా అభిమాన నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేసే ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను? రెండో ఆలోచన చేయకుండా అంగీకరించాను. అయితే, సినిమా అంగీకరించిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. నాగ్ సార్ తో ఎలా ఉండాలో .. ఆయన నన్ను ఎలా ట్రీట్ చేస్తారో .. ఆయన కాంబినేషన్లో ఎలా చేయాలో అనే భయం ఉండేది. కానీ నాగార్జున గారు మొదటి రోజే నాలోని భయాన్ని పోగొట్టారు .. నన్నెంతగానో ప్రోత్సహించారు. సినిమా విడుదలయ్యాక నా పాత్రకి దక్కే క్రెడిట్ అంతా కూడా ఆయనకే చెందుతుంది" అని చెప్పుకొచ్చాడు.     
nagajuna
nani

More Telugu News