రూ. 500 అప్పు తీర్చలేదని... స్నేహితుడి భార్యను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు!
- కర్ణాటక, బెళగావి జిల్లాలో ఘటన
- స్నేహితుడికి రూ. 500 అప్పిచ్చిన రమేశ్
- డబ్బు ఇవ్వడంలేదని ఫ్రెండ్ భార్య కిడ్నాప్, వివాహం
- అడిగితే దాడులు చేయిస్తున్నాడన్న బసవరాజు
ఈ అప్పు తిరిగి ఇవ్వడంలో బసవరాజు విఫలంకాగా, పలుమార్లు వాదనలు కూడా జరిగాయి. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, పార్వతిని ఎత్తుకెళ్లిన రమేశ్, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై అడిగితే, తనపై దాడులు చేస్తున్నాడని బసవరాజు ఆరోపిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, వారు కేసు నమోదు చేసుకోవడం లేదని ఆరోపించాడు. తన భార్యను కాపాడాలని బసవరాజు వేడుకున్నాడు.