తొలి పారితోషికాన్ని కేరళకి విరాళంగా ఇచ్చేసిన విక్రమ్ తనయుడు ధృవ్!

సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' కథానాయకుడిగా 'వర్మ' సినిమాతో తమిళ తెరకి పరిచయమవుతున్నాడు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్టులుక్ ను .. టీజర్ ను వదిలారు. వీటికి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి హీరోగా అందుకున్న పారితోషికం మొత్తాన్ని చెక్కు రూపంలో, కేరళ వరద బాధితుల కోసం అక్కడి ముఖ్యమంత్రి సహాయ నిధికి 'ధృవ్' విరాళంగా అందజేశాడు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'ధృవ్' ను అభినందించారు. ఇక ఈ సినిమాలో ధృవ్ జోడీగా బెంగుళూర్ కి చెందిన మోడల్ మేఘ కథానాయికగా నటించింది. హీరోగా ఈ సినిమా ధృవ్ ను నిలబెడుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. తెలుగులో మాదిరిగా తమిళంలోను ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.    
Go Back to Shorts
dhruv
vikram
megha

More Telugu News