'అరవింద సమేత'లో తన పోర్షన్ పూర్తిచేసిన పూజా
Add ap7am to your home Screen

'అరవింద సమేత'లో తన పోర్షన్ పూర్తిచేసిన పూజా

  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • తీర్చిదిద్దుతోన్న త్రివిక్రమ్ 
  • దసరాకి భారీస్థాయి విడుదల
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి పూజా హెగ్డే పోర్షన్ పూర్తయింది. ఈ విషయాన్ని ఆమె స్పెషల్ వీడియో ద్వారా తెలియజేసింది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేయమని చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి .. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది . అందువలన ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ పడినట్టేననే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తరువాత తాను చేస్తోన్న సినిమా కావడంతో, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని దర్శకుడు త్రివిక్రమ్ దీనిని తీర్చిదిద్దుతున్నాడు.  
ntr
pooja hegde

More Telugu News