ఆత్మరక్షణలో నిర్మలా సీతారామన్.. ఫ్రెంచి జర్నలిస్టులను బయటకెళ్లాలని కోరిన వైనం!
- కేంద్ర ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్న రాఫెల్ ఒప్పందం
- మీడియా ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తున్న రక్షణ మంత్రి
- కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందన్న విశ్లేషకులు
ఈ నేపథ్యంలో ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ, ఫ్రెంచ్ జర్నలిస్టులను నిర్మల బయటకు వెళ్లిపోవాలని కోరడంతో తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. ఈ అంశం ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాఫెల్ ఒప్పందంపై ఓవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే... జర్నలిస్టుల సందేహాలను కూడా కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయలేకపోతోందని... కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.