'అరవింద సమేత' నుంచి ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్
Add ap7am to your home Screen

'అరవింద సమేత' నుంచి ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్

  • ముగింపు దశలో 'అరవింద సమేత'
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు 
  • లీకుల పట్ల ఫ్యాన్స్ లో అసహనం      
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి మొదటి నుంచి కూడా లీకుల బెడద వుంది. ఎన్టీఆర్ .. నాగబాబు తదితరులకు సంబంధించిన యాక్షన్ సీన్ ఫోటోలు కొన్ని ఇటీవల బయటికి వచ్చాయి. అప్పటి నుంచి త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా అదే ఫైట్ సీన్ కి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్ లో లీక్ చేసేశారు. ఎన్టీఆర్ .. నాగబాబు కార్లో వెడుతూ వుంటే విలన్ గ్యాంగ్ దాడి చేసే సీన్ ఇది. సినిమాలోని కీలకమైన ఈ ఫైట్ సీన్ లీక్ కావడం ఎన్టీఆర్ అభిమానులకి ఆశ్చర్యాన్నీ .. అసంతృప్తిని కలిగిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతోన్న సమయంలో ఒక సీన్ అంతా లీక్ కావడం పట్ల అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.       
ntr
pooja hegde

More Telugu News