'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్

  • అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు
  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇటీవలే ఈ సినిమాలో బాలకృష్ణ - రానా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. చంద్రబాబునాయుడిగా రానా లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏఎన్నార్ గా సుమంత్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీలో ఆయన పోలికలు ఎక్కువగా సుమంత్ లో కనిపిస్తాయనే సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్' బయోపిక్ లో సుమంత్ .. అక్కినేని ట్రేడ్ మార్క్ కళ్లజోడు .. లాల్చీతో అచ్చు అలాగే చూస్తూ అక్కినేనిని గుర్తుచేస్తున్నాడు. మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో అలాగే అనిపిస్తున్నాడు. బాలకృష్ణ .. సుమంత్ (ఎన్టీఆర్ - ఏఎన్నార్) కాంబినేషన్లోని మరో పోస్టర్ సాయంత్రం రావచ్చునని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
balakrishna
sumanth

More Telugu News