చిరూ, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో అశ్వనీదత్ సినిమాలు!
Add ap7am to your home Screen

చిరూ, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో అశ్వనీదత్ సినిమాలు!

  • చిరంజీవి కోసం కథ రెడీ అవుతోంది 
  • ఎన్టీఆర్ తో ఒక సినిమా వుంటుంది 
  • విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు
కొంతకాలం క్రితం 'శక్తి' సినిమా పరాజయంతో సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చిన అశ్వనీదత్, 'మహానటి' విజయం తరువాత వరుస సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. "ప్రస్తుతం చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడు. ఆ కథ చిరంజీవికి కరెక్టుగా సరిపోతుందని అనిపించింది. పూర్తికథ సిద్ధమైన తరువాత ఒక నిర్ణయానికి వస్తాను" అన్నారు.

"ఇక ఎన్టీఆర్ తో ఒక సినిమా .. విజయ్ దేవరకొండతో రెండు సినిమాలను నిర్మించే ఆలోచన వుంది. ఈ మూడింటిలో ఒక సినిమాకి అట్లీ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తాడు. నిర్మాతలుగా నా కుమార్తెలు మంచి విజయాలను సాధిస్తున్నారు. కొంతకాలం తరువాత వారే పూర్తిస్థాయిలో నిర్మాణ బాధ్యతలను స్వీకరిస్తారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మా బ్యానర్ నుంచి సినిమాలు వస్తాయి" అని చెప్పుకొచ్చారు.  
chiranjeevi
ntr
vijay devarakonda

More Telugu News