కుమార్తె ప్రియుడిని బెదిరించిన తండ్రి... భయంతో ఆత్మహత్య!
- ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ఘటన
- బెదిరింపులకు భయపడి వెంకటకృష్ణ ఆత్మహత్య
- ప్రియురాలి తండ్రిని అరెస్ట్ చేయాలని ఎస్సీ సంఘాల డిమాండ్
- గ్రామంలో ఉద్రిక్తతతో రంగంలోకి దిగిన పోలీసులు
మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంటి ఆవరణలో కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. అతని బైకును ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ విధ్వంసం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు మరింతగా చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటకృష్ణ మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.