నా సినిమాల్లో అసభ్యత వుండదు .. సందేశం కనిపిస్తుంది: దర్శకుడు మారుతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమాల్లో అసభ్యత వుండదు .. సందేశం కనిపిస్తుంది: దర్శకుడు మారుతి

  • నా సినిమాలు ఒకసారి చూడండి 
  • హీరోయిన్లను అసభ్యంగా చూపించలేదు 
  • అందువల్లనే జనం వస్తారని నేను నమ్మను  
ప్రేమకథా చిత్రాలతో తన కెరియర్ ను ఆరంభించిన మారుతి, ఆ తరువాత వైవిధ్యభరితమైన సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఇదే విషయాన్ని గురించి ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ప్రస్తావించాడు. "నా సినిమాలు మీరు చూడండి .. ఎక్కడా ఇంతవరకూ హీరోయిన్లను అసభ్యంగా చూపించలేదు. హీరోయిన్లను అసభ్యంగా చూపిస్తేనే జనం సినిమాకి వస్తారనే విషయాన్ని నేను నమ్మను.

అబ్బాయిలను మోసం చేయవద్దని 'ఈ రోజుల్లో' చెప్పాను. పేరెంట్స్ ను నమ్మించవద్దనే విషయాన్ని 'బస్టాప్' ద్వారా ఆవిష్కరించాను. చిన్న చిన్న విషయాలకే సూసైడ్స్ చేసుకోవద్దని 'ప్రేమకథా చిత్రమ్'లో చెప్పాను. ఒక చిన్న లోపం ఉన్నంత మాత్రాన అవతలివారిని ఎందుకు ప్రేమించకూడదు? అనే సందేశాన్ని 'భలే భలే మగాడివోయ్' ద్వారా ఇచ్చాను. పిల్లలు తమ పెళ్లి విషయాన్ని పేరెంట్స్ చేతుల్లోనే ఉంచాలి అనే విషయం 'శైలజా రెడ్డి అల్లుడు'లో చెప్పుకొచ్చాను" అని అన్నారు.    
maruthi

More Telugu News