మంత్రి సోమిరెడ్డిని ఈ మెయిల్‌లో దూషించింది 70 ఏళ్ల వృద్ధుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి సోమిరెడ్డిని ఈ మెయిల్‌లో దూషించింది 70 ఏళ్ల వృద్ధుడు!

  • సీఎం చంద్రబాబుపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు 
  •  పోలీసులకు ఫిర్యాదు చేసిన అమాత్యుడు
  •  సదరు వృద్ధుడు హైదరాబాదీగా పోలీసుల గుర్తింపు
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలపై ఈ మెయిల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఓ 70 ఏళ్ల వృద్ధుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మంత్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తులోకి దిగిన పోలీసులు అడ్రస్‌ ఆధారంగా పరిశీలించారు. మెయిల్‌ పంపిన వ్యక్తి హైదరాబాద్ కు చెందినతను కాగా, అతన్ని సీనియర్ సిటిజన్ గా గుర్తించారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఆ వృద్ధుడిని ఇబ్బంది పెట్టవద్దని సూచించినట్లు సమాచారం.
somireddy
-Telugudesam
Andhra Pradesh

More Telugu News