మారుతీరావు చెప్పినట్టే జరిగింది... ప్రీ వెడ్డింగ్ వీడియో హిట్స్ ను దాటిన హత్య సీసీటీవీ ఫుటేజ్ హిట్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మారుతీరావు చెప్పినట్టే జరిగింది... ప్రీ వెడ్డింగ్ వీడియో హిట్స్ ను దాటిన హత్య సీసీటీవీ ఫుటేజ్ హిట్స్!

  • అమృత ప్రీ వెడ్డింగ్ వీడియోకు దాదాపు లక్ష వ్యూస్
  • మర్డర్ సీసీటీవీ ఫుటేజ్ ని వీక్షించిన లక్షలాది మంది
  • శుక్రవారం నాడు జరిగిన పరువు హత్య
"నీ పెళ్లి వీడియో కంటే, ప్రణయ్‌ ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయి" తన ప్రియుడు ప్రణయ్ తో తీయించుకున్న ప్రత్యేక ప్రీ వెడ్డింగ్ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో అమృత వర్షిణి అప్ లోడ్ చేసిన తరువాత ఆమె తండ్రి మాధవరావు చేసిన హెచ్చరిక ఇది. ఫేస్ బుక్ లో మూడు వారాల క్రితం అమృత ఈ వీడియోను పోస్టు చేయగా, ఇప్పటివరకూ 96 వేల హిట్స్ వచ్చాయి. అంటే, ఈ వీడియోను దాదాపు లక్ష మంది చూసినట్టు. ఇక శుక్రవారం నాడు ప్రణయ్ పై బలమైన కత్తితో దాడి చేస్తున్న వేళ, ఆ దృశ్యాలు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ దృశ్యాలను అన్ని తెలుగు టీవీ వార్తా చానల్స్ తో పాటు, ఇంగ్లీషు, హిందీ తదితర జాతీయ చానళ్లు సైతం చూపించాయి. ఈ దృశ్యాలను కొన్ని లక్షల మంది తిలకించారు. ఈ మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ప్రకారం, ఒక్క యూట్యూబ్ చానళ్ల హిట్స్ ను పరిశీలిస్తే, ఈటీవీ తెలంగాణలో పరువు హత్య వీడియోను 52 వేల మంది, ఈటీవీ ఏపీ చానల్ లో 21 వేల మంది, టీవీ 1లో 18 వేల మంది, యోయో టీవీలో 13 వేల మంది చూశారు. హత్యకు సంబంధించిన పలు వార్తలకు టీవీ9లో 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎన్ టీవీలో లక్షన్నర మంది చూశారు. మిగతా చానళ్లలోనూ లక్షలాది మంది హత్య దృశ్యాలను వీక్షించారు.
Miryalaguda
Amrutha
Pre Wedding Video
CCTV Footage

More Telugu News