సిద్ధిపేటలో హరీశ్ ఓడిపోతాడనే నన్ను అరెస్ట్ చేయించారు!: జగ్గారెడ్డి ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిద్ధిపేటలో హరీశ్ ఓడిపోతాడనే నన్ను అరెస్ట్ చేయించారు!: జగ్గారెడ్డి ఆరోపణ

  • నేనెవరినీ అమెరికాకు తీసుకుపోలేదు
  • కేసీఆర్, హరీశ్ పై కూడా నకిలీ పాస్ పోర్ట్ కేసులున్నాయి
  • ఇది కక్ష సాధింపు చర్యే
భార్యాపిల్లల పేరుతో గుజరాతీ కుటుంబాన్ని అమెరికాకు అక్రమ రవాణా చేశారన్న కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి)ని పోలీసులు నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జగ్గారెడ్డిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

రాజకీయ కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ సభ తర్వాత తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్, హరీశ్ రావు కుట్ర చేశారన్నారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావును గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేశారని జగ్గా రెడ్డి అన్నారు. తాను ఎవరినీ విదేశాలకు తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. కేసీఆర్, హరీశ్ రావుపై కూడా నకిలీ పాస్‌పోర్ట్ కేసులున్నాయని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పారు.

నిన్న పటాన్‌చెరులో ఓ కార్యక్రమంలో ఉండగా జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. భార్యాపిల్లల పేరుతో వీసాలు తీసుకున్న జగ్గారెడ్డి ఓ గుజరాతీ మహిళ, ఆమె పిల్లలను 14 ఏళ్ల క్రితం అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వదిలి వచ్చేశారని నిన్న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు.
kcr
Harish Rao
Siddipet District
jagga reddy
arrest
USA
human trafficking

More Telugu News