ప్రాణం కోల్పోయిన రెండేళ్ల చిన్నారి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ!
- దేశ వ్యాప్తంగా భారత్ బంద్
- జెహానాబాద్ లో రోడ్డుపై బాలిక మృతి
- రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్న రవిశంకర్ ప్రసాద్
ఈ ఘటనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. 'నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, రెండేళ్ల చిన్నారి రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ రంజన్ ఘోష్ స్పందిస్తూ, చిన్నారిని తీసుకొస్తున్న వాహనాన్ని ఎవరూ ఆపలేదని చెప్పారు. వారు ఇంటి నుంచే ఆలస్యంగా బయల్దేరి ఉండవచ్చని తెలిపారు. అంబులెన్స్ లను కానీ, ఆసుపత్రికి వస్తున్న వాహనాలను కానీ నిరసనకారులు ఎవరూ ఆపలేదని చెప్పారు.