తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాదుకు రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఈ బృందం ఎన్నికల నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లను పరిశీలించనుంది. పర్యటన అనంతరం, ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక ఇస్తుంది.