కేసీఆర్ ని ఆపద్ధర్మ సీఎంగా తొలగించాలి: కోదండరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ని ఆపద్ధర్మ సీఎంగా తొలగించాలి: కోదండరామ్

  • సుపరిపాలన అందించే వారు అసెంబ్లీ రద్దు చేయరు
  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
  • రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
అసెంబ్లీని రద్దు చేసి తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న కేసీఆర్ ని ఆపద్ధర్మ సీఎంగా తొలగించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుపరిపాలన అందించే ముఖ్యమంత్రి ఎవరూ అసెంబ్లీని రద్దు చేయరని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని, మార్పు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గవర్నర్ నరసింహన్ ని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని అన్నారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు చెప్పారు. 
kcr
kondanda ram

More Telugu News