కాషాయ పార్టీలోకి మరో యోగి.. బీజేపీలోకి స్వామి పరిపూర్ణానంద?
- స్వామిని బీజేపీలోకి లాగే ప్రయత్నంలో నేతలు
- తెలంగాణలో మజ్లిస్‌కు అడ్డుకట్ట వేయగల శక్తి ఆయన సొంతం
- పార్టీ సమావేశంలో చర్చ
సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నిత అంశంపై వాతావరణం వేడెక్కడంతో, పోలీసులు స్పందించి తొలుత కత్తి మహేశ్‌ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించారు. 55 రోజుల బహిష్కరణ తర్వాత స్వామి భారీ ర్యాలీతో రెండు రోజుల క్రితం నగరంలో అడుగుపెట్టారు.