చంద్రబాబు గారూ, ఇదీ తమరు చేసింది!: చంద్రబాబుపై రోజా ఫైర్
- మెడికల్ హబ్ చేస్తానన్నారు
- కనీస సదుపాయాలు కల్పించండి
- ఫొటోలు ట్వీట్ చేసిన వైసీపీ నేత
విజయనగరంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు మహిళలకు ఒకే స్టాండ్ సాయంతో సెలైన్లు ఎక్కిస్తున్న, ఒకే బెడ్ పై ఐదుగురు రోగులను కూర్చోబెట్టిన ఫొటోలను ఈ రోజు రోజా ట్వీట్ చేశారు. ‘ఏపీని మెడికల్ హబ్ చేస్తానన్న నారా చంద్రబాబునాయుడు గారూ.. ఇదీ తమరు చేసింది. విజయనగరం జిల్లాలో కొత్తవలస గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసింది ఈ చిత్రం. ఈ ప్రభుత్వానికి గిరిపుత్రుల ప్రాణాలు అక్కర్లేదు కానీ వాళ్ల ఓట్లు కావాలా?’ అని రోజా ట్విట్టర్ లో ప్రశ్నించారు.