అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు చూపిన కారణాలనే చూపించనున్న కేసీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు చూపిన కారణాలనే చూపించనున్న కేసీఆర్!

  • 2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు
  • వివరాలు సిద్ధం చేసిన అధికారులు 
  • న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు
‘ముందస్తు’ వైపు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకోసం పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ రద్దుకు కారణాలు చూపడంపై కసరత్తు చేస్తున్న ఆయన, గతంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూపిన కారణాలనే తాను కూడా చూపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ రద్దుకు ఏయే కారణాలు చూపించాలన్న దానిపై కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వివరాలు సిద్ధం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఆ వివరాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సీఎస్ జోషికి అందించారు.

2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు అసెంబ్లీ రద్దుకు చూపిన కారణాన్నే తాను కూడా చూపించాలని భావిస్తున్న కేసీఆర్ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీని కనుక రద్దు చేసి ఎన్నికలకు వెళితే కొందరు దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. మరోవైపు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి చిక్కులు, సమస్యలు రాకుండా రద్దు ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Telangana
KCR
Chandrababu
Elections

More Telugu News