Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెట్లో ఎన్టీఆర్ వున్నారు .. మా అన్నయ్య వచ్చి నన్ను ఆ సీన్ చేయొద్దని అన్నాడు: శివకృష్ణ

  • రామారావుగారంటే నాకెంతో ఇష్టం 
  • 'నా దేశం'లో ఒక ముఖ్యమైన పాత్ర చేశాను
  • మా అన్నయ్య వచ్చి నన్ను వారించాడు  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో శివకృష్ణ మాట్లాడుతూ, 'నా దేశం' సినిమా గురించి ప్రస్తావించారు. కె.బాపయ్య గారు 'నా దేశం' సినిమాకి దర్శకులు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను నాతో చేయించారు. నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కనుక .. ఆయన సినిమాలో చేయడానికి అంగీకరించాను. ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ముషీరాబాద్ 'కట్టెలడితి'లో షూట్ చేశారు. అక్కడి సీన్లో దుంగలు దొర్లి నాపై పడి చేతులు కట్ అయ్యే  సీన్ ను చిత్రీకరించనున్నారు.

సరిగ్గా ఆ సమయంలో మా అన్నయ్య అక్కడికి వచ్చాడు. తీయబోయే సీన్ ఏమిటన్నది తెలుసుకున్నాడు. నాపై పడేది నిజమైన దుంగలు అనుకుని, డ్రైవర్ ని పిలిచి నన్ను ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నాడు. ఆ దుంగలు పడి ఏమైనా అయితే ఏమిటి పరిస్థితి ..నువు యాక్ట్ చేయడానికి వీల్లేదు' అన్నాడు. సెట్లో ఎన్టీఆర్ గారు వున్నారు .. ఆయనతో చేయాలనేది నా కల .. అందువలన మా అన్నయ్యకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశాను" అని చెప్పుకొచ్చారు.     
shivakrishna
ali

More Telugu News