‘ఫెస్టివల్ సేల్’ ఆఫర్ ప్రకటించిన ‘ఇండిగో’.. ప్రారంభ ధర రూ 999
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఫెస్టివల్ సేల్’ ఆఫర్ ప్రకటించిన ‘ఇండిగో’.. ప్రారంభ ధర రూ 999

  • ‘ఫెస్టివల్ సేల్’ నేటి నుంచి ప్రారంభం
  • నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది
  • అతి తక్కువ ప్రారంభ టికెట్ ధర రూ.999
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ‘ఫెస్టివల్ సేల్’ ను ఈరోజు నుంచి ప్రారంభించింది. ‘ఫెస్టివల్ సేల్’ పేరిట ప్రయాణికులకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 2019 మార్చి 30 మధ్య ప్రయాణించే నిమిత్తం ఈ ఆఫర్ ను ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని, రూ.999 అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ‘ఇండిగో’ ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్ పేర్కొన్నారు.

 మొబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి అయితే దాదాపు రూ.600 వరకూ ఇరవై శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. అతి తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్న కారణంగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్టు విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ఈ విధంగా టికెట్లు అమ్మడం ద్వారా మరిన్ని లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దాదాపు పది లక్షల టికెట్లను విక్రయించే లక్ష్యంతోనే అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.
indigo

More Telugu News