'టైమ్ లేదు .. వెళ్లిపోతున్నాను'.. నాతో హరికృష్ణ చెప్పిన చివరి మాటలు ఇవే!: పరుచూరి గోపాలకృష్ణ

03-09-2018 Mon 13:52 | Entertainment
  • పెళ్లికి రమ్మని హరికృష్ణను ఆహ్వానించాను
  • సత్యనారాయణ వ్రతానికి రమ్మని కోరాను 
  • నేను రాలేను అనే ఆయన చెప్పాడు         
ఆగస్టు 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయిన సంగతి తెలిసిందే. తనతో ఆయన మాట్లాడిన చివరి మాటలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. "ఆగస్టు 27వ తేదీన ఉదయం నేను హరికృష్ణకు ఫోన్ చేశాను. 'నాన్నా, మా అల్లుడు .. కూతురు మీ ఇంటికొచ్చి శుభలేఖ ఇచ్చారు చూశావా?' అని అడిగాను. 'చూడలేదు .. ఎవరిది పెళ్లి?' అని అడిగాడు. 'నా మనవరాలి పెళ్లి .. ఆగస్టు 30వ తేదీన .. నువ్వొచ్చి అక్షితలు వేస్తే .. అన్నగారే వచ్చి అక్షితలు వేసినట్టుగా భావిస్తాను' అన్నాను.

'సారీ రాలేను' .. 29 ఉదయాన్నే ఊరికి వెళుతున్నాను .. 30 పొద్దున్నే రాగలుగుతానో లేదో నాకు తెలియదు కదా' అన్నాడు. 'పోనీ ఒక పనిచేయి హరి .. 31వ తేదీన ఉదయం 'సత్యనారాయణ స్వామి వ్రతం' వుంది .. అప్పుడైనా వచ్చి వధూవరులకు అక్షితలు వేయి' అన్నాను. 'అప్పుడు కూడా 'రాలేను' అనే అన్నారు. 'రాలేను' అనే మాట నేను తన నోటివెంట వినడం అదే  మొదటిసారి.

అయితే ఈ రోజు (ఆగస్టు 27వ తేదీ) ఉదయం 11 గంటల 30 నిమిషాలకి నా మనవరాలిని పెళ్లి కూతురుని చేస్తారు .. అప్పుడు వచ్చి అక్షితలు వేయి' అని అడిగాను. అయితే ఆ రోజున నేను బయటికి వెళ్లినప్పుడు హరికృష్ణ వచ్చి నా మనవరాలికి అక్షితలు వేశారు. ఆయన వచ్చినట్టు తెలిసి నేను ఫోన్ చేసి రెండు నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పాను. అప్పుడు ఆయన 'టైమ్ లేదు వెళ్లిపోతున్నాను' అని అన్నాడు. ఎందుకు ఆ భగవంతుడు ఆయనతో అలా మాట్లాడించాడో .. ఎందుకిలా జరిగిందో అసలు అర్థం కావడం లేదు" అని చెప్పుకొచ్చారు.       
paruchuriharikrishna

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more