అనుపమ, పూజా హెగ్డే బాటలో మెహ్రీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుపమ, పూజా హెగ్డే బాటలో మెహ్రీన్

  • షూటింగు దశలో 'ఎఫ్ 2'
  • దర్శకుడిగా అనిల్ రావిపూడి 
  • వరుణ్ జోడీగా మెహ్రీన్    
తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టేసిన ఈ సుందరి, 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' సినిమాలతో యూత్ కి మరింత చేరువైంది. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న 'ఎఫ్ 2' సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కథానాయికలు తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. తెలుగు నేర్చేసుకుని డబ్బింగ్ చెప్పేసి ఓకే అనిపించుకున్న కథానాయికలలో సమంత .. రకుల్ .. అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తున్నారు. ఇక పూజా హెగ్డే కూడా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాకి గాను తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మెహ్రీన్ కూడా 'ఎఫ్ 2'లో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శక నిర్మాతలను అడిగిందట. అందుకు వాళ్లు అంగీకరించడంతో ఆమె రంగంలోకి దిగుతున్నట్టుగా చెబుతున్నారు.   
mehreen
anupama
pooja hegde

More Telugu News