‘నిన్ను నీవే జయించిరారా రాజశేఖరా’.. అదరగొడుతున్న ‘యాత్ర’ పాట లిరిక్స్
- విడుదల చేసిన చిత్ర యూనిట్
- వైఎస్సార్ పాదయాత్రపై గీతం
- 9వ వర్ధంతి సందర్భంగా విడుదల
‘నీ కనులలో కొలిమై.. రగిలే కలేదో నిజమై తెలవారనీ.
వెతికే వెలుగై రానీ
ఈనాటి ఈ సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం
ఈ సంధ్యలో స్వర్ణ వర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం
ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనది
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించి రారా రాజశేఖరా’ అంటూ పాట అదరగొడుతోంది.

ఈ సినిమాకు మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించగా, కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. యాత్రను 2019, జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.