చంద్రబాబు బయోపిక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు బయోపిక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!

  • విడుదల చేసిన చిత్రయూనిట్
  • బాబు బాల్యం నుంచి సీఎం వరకూ
  • వచ్చే నెలలో సినిమా రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే నటి సావిత్రి జీవితంపై ‘మహానటి’ చిత్రం తెరకెక్కగా, మాజీ సీఎంలు వైఎస్సార్, ఎన్టీఆర్ లతో పాటు కాంతారావు బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక ప్రముఖ రెజ్లర్ కోడి రామ్మూర్తినాయుడు బయోపిక్ లో ప్రధాన పాత్రలో రానా నటించనున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా టైటిల్ ను ‘చంద్రోదయం- బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’గా ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చంద్రబాబు ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే చంద్రోదయం సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.


ఈ సినిమాలో చంద్రబాబుగా వినోద్ నువ్వుల, ఎన్టీఆర్ గా భాస్కర్ నటిస్తుండగా.. వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ పీఆర్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. 
Chandrababu
biopic
chandrodayam
first look

More Telugu News