Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఛత్రపతి' నాకు బాగా నచ్చిన సినిమా: అభిషేక్ బచ్చన్

  • తెలుగు సినిమాలు బాగా చూస్తుంటాను 
  • 'ఛత్రపతి' కథ పర్ఫెక్ట్ గా ఉంటుంది 
  • ఆ సినిమా రీమేక్ లో చేయాలనుంది
బాలీవుడ్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే హీరోల్లో అభిషేక్ బచ్చన్ కూడా ముందువరుసలో కనిపిస్తారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన ప్రేక్షకులను మెప్పిస్తూ వుంటారు. అలాంటి అభిషేక్ బచ్చన్ తాజాగా తెలుగు సినిమాలను గురించి మాట్లాడారు.

"ఈ మధ్య కాలంలో కొంచెం బిజీగా ఉండటం వలన తెలుగు సినిమాలను ఎక్కువగా చూడటం లేదు గానీ, అంతకు ముందు బాగా చూసేవాడిని. ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా ఏ తెలుగు సినిమాలు థియేటర్స్ లో వున్నాయి .. ఏ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది? అనేది తెలుసుకుంటూ ఉంటాను. హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అందుకు గల కారణాలేమిటనేది పరిశీలించడానికి ఆసక్తిని చూపుతాను.

" హిందీలోకి రీమేక్ అయితే .. ఏ తెలుగు సినిమాలో చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు?" అనే ప్రశ్నకి ఆయన ఎంత మాత్రం ఆలోచించకుండా 'ఛత్రపతి' పేరు చెప్పారు. 'తెలుగులో ప్రభాస్ చేసిన 'ఛత్రపతి' సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ .. లవ్ .. రొమాన్స్ .. సెంటిమెంట్ సమపాళ్లలో ఉంటాయి. 'ఛత్రపతి' రీమేక్ లో చేసే ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను' అని ఆయన చెప్పుకొచ్చారు.   
abhishek

More Telugu News