'నవాబ్'కి విజయ్ దేవరకొండ నో చెప్పింది అందుకేనట!
Add ap7am to your home Screen

'నవాబ్'కి విజయ్ దేవరకొండ నో చెప్పింది అందుకేనట!

  • మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్'
  • విజయ్ దేవరకొండను సంప్రదించిన టీమ్ 
  • ఆయన కోసం అనుకున్న పాత్రలో శింబూ  
మణిరత్నం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'చెక్క చివంత వానమ్' అనే తమిళ సినిమా రెడీ అవుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నప్పుడు విజయ్ దేవరకొండను కూడా ఒక పాత్ర కోసం అడిగారట. 'అర్జున్ రెడ్డి' సినిమా భారీ విజయాన్ని సాధించడం వలన, తమిళనాట కూడా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది.

అందువలన ఆయనను తీసుకుంటే బాగుంటుందని భావించి సంప్రదించారట. అయితే ఈ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగానే తిరస్కరించాడట. తాను అనుకున్న దానికంటే పారితోషికం తక్కువగా ఉండటం .. నలుగురు కథానాయకులలో ఒకరిగా కనిపించడం ఇష్టం లేకపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తిరస్కరించిన ఆ పాత్ర కోసమే శింబూను తీసుకున్నట్టుగా సమాచారం. 
vijay devarakonda

More Telugu News