తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో విజయ్

  • మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్'
  • విజయ్ సరసన కీర్తి సురేశ్ 
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో విజయ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. తన కెరియర్లో ముఖ్యమంత్రిగా ఆయన తెరపై కనిపించనుండటం ఇదే మొదటిసారి. సమకాలీన రాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ, యూత్ ను ప్రభావితం చేసే విధంగా ఆయన పాత్రను తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రాధారవి కనిపిస్తారట. ఈ ఇద్దరికీ మధ్య జరిగే వార్ ఉత్కంఠభరితంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగులో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక అదే తరహా పాత్రలో విజయ్ కూడా సంచలన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి మరి.   
vijay
kerthi suresh

More Telugu News