మరొక్క 8 మీటర్లే.. కుతుబ్ మీనార్‌ ఎత్తును దాటేయనున్న ఢిల్లీ చెత్త!

01-09-2018 Sat 10:37 | National
  • ఢిల్లీ ఘజీపూర్‌లో రికార్డు స్థాయిలో పేరుకుపోయిన చెత్త
  • కొండను తలపిస్తున్న డంపింగ్ యార్డ్
  • రాజధానిలో రోజుకు 2,600 టన్నుల చెత్త ఉత్పత్తి
మరొక్క ఎనిమిది మీటర్లు చాలు.  73 మీటర్ల ఎత్తైన కుతుబ్ మీనార్‌ను అధిగమించేందుకు... అవును.. ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ డంపింగ్ యార్డ్‌లో ఇప్పటికే 65 మీటర్ల ఎత్తున చెత్త పేరుకుపోయి పెద్ద కొండను తలపిస్తోంది. మరో 8 మీటర్ల మేర చెత్తను దానిపై డంప్ చేస్తే కుతుబ్ మీనార్ ఎత్తును కూడా దాటేస్తుంది. నిజానికి చెత్త డంపింగ్ 20 మీటర్లకు మించి ఉండకూడదనే నిబంధన ఉంది. ఇప్పుడిక్కడ పేరుకుపోయిన చెత్త దానికంటే 45 మీటర్లు అధికంగా ఉంది. మొత్తం 70 ఎకరాల్లో 12 మిలియన్ టన్నుల చెత్త ఇప్పుడక్కడ పేరుకుపోయింది.  

ఢిల్లీలో ప్రతీరోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను డంపింగ్ చేసేందుకు తమకు మరోమార్గం లేదని ఈడీఎంసీ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ ప్రదీప్ ఖండేవాల్ తెలిపారు. 1984 నుంచి ప్రభుత్వం ఘాజీపూర్‌లో చెత్తను డంప్ చేస్తోంది. నగరంలో ఇదే అత్యంత పురాతనమైన డంపింగ్ యార్డ్. ఢిల్లీలో ప్రతీ రోజు 2,600 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, దానిని మొత్తంగా ఇక్కడే డంప్ చేస్తున్నారు. ఇది కాస్తా కొండను తలపిస్తూ ప్రమాదకరంగా మారడంతో కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
DelhiGhazipur landfillQutub MinargarbageDumping

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more