వెండితెరకు ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్.. టైటిల్ రోల్ లో వినోద్ నువ్వుల!
- బయోపిక్ ల పర్వంలో మరొకటి
- విద్యార్థి నేత నుంచి సీఎం వరకూ చిత్రీకరణ
- 80 శాతం షూటింగ్ పూర్తి
ఓ నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు తొలుత విద్యార్థి నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా.. చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తుండగా.. జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.
ఈ సినిమా దర్శకుడు వెంకట రమణ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 23 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విస్మరించలేమన్నారు. ఈ సినిమాకు రాజ్ కిరణ్ పి.ఆర్ సంగీతం అందిస్తున్నారు.